Book Review - Ramachakani gali patam

Book Review – Devi

Book Title –Ramachakani gali patam

Author – Durgam bhaithi

అందర్కి నమస్కారం నా పేరు దేవి , నేను సోహం లీడర్షిప్ ప్రోగ్రాం బ్యాచ్ 3 . నేను ఈ slp లో చదివిన పుస్తకం రామసకని గాలిపటం . దీని రచించింది దుర్గం భైతి గారు . నేను ఈ పుస్తకం లో నేర్చుకున విషయాలు మితో పంచుకోవాలి అనుకుంటున్నాను .

   రామసక్కని గాలిపటం బాలల కథలు అనే పుస్తకం చాలా బాగుంది. ఈ కథలు ఎంతో మంది పిల్లలకు మార్గదర్శకం చేసేలా ఉన్నాయి. ఇందులో అన్ని మంచి కథలే ఉన్నాయి. కథలు అన్ని చదవాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.పుస్తకం పేరులోనే మంచి ప్రేరణ కలిపిస్తుంది.

‘మొదటి అడుగు’ అనే కథలో రాజు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మొదటి అడుగు పడింది. అలాగే అందరు విద్యార్థులు తమ లక్ష్యం నేరవేరడానికి మొదటి అడుగుతో ప్రారంభం అవుతుంది. కాని మనం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు అనుకోకూడదు. అదే మొదటి అడుగు అనుకోవాలి అనే సందేశం ఈ కథ చెబుతుంది.

‘ తెగిన గాలిపటం’ అనే కథలో ఒక గాలిపటం గాలిలో ఎగురుతుంటే దానికి విలువ ఉంటుంది. కాని గాలిపటం తెగి దారి తప్పి ఎక్కడైన పడితే దానికి విలువ ఉండదు. అలాగే ఒక విద్యా విద్యార్థి పాఠశాలలో చదువుకుంటేనే విద్యార్థికి విలువ ఉంటుంది. కాని పాఠశాలకు వెళ్ళకుండా తిరుగుతే ఆ విద్యార్థికి విలువ ఉండదు అనే గొప్ప ప్రేరణ మనకు ఈ కథ ద్వారా కలుగుతుంది.

‘మార్పు మంచిదే’ అనే కథలో తుమ్మ చెట్టు తప్పుగా అర్థం చేసుకుంటుంది. మామిడి చెట్టు తుమ్మచెట్టుకి ఎంతో నచ్చచెప్పింది కాని వినలేదు. కొన్ని రోజులకు తుమ్మచెట్టు తన తప్పును అర్థం చేసుకొని మామిడి చెట్టును క్షమాపణ అడుగుతుంది. ఈ విధంగా మార్పు మంచిదే కాని మార్పు చెడు మార్పు కాకూడదు అనే విషయం మనం గ్రహించవచ్చు.

‘పులితో ఆటలా’ అనే కథలో నీలకంఠం చెడు దారిలో డబ్బు సంపాదిస్తే అది అనుభవించకుండానే పులికి ఆహారమయ్యాడు. అందుకే ఎప్పుడు చెడు దారిలో డబ్బు సంపాదించకూడదు. డబ్బుల కోసం ఏ చెడు పని చేయకూడదు అనే నీతిని ఈ కథ తెలియచేస్తుంది.

‘మెత్తని మోసం’ అనే కథలో ధర్మయ్య సహాయం అడిగిన గోపయ్యకు కాదనకుండా సహాయం చేస్తాడు. కాని గోపయ్య మోసం చేసాడు. గోపయ్యకి శిక్ష పడింది. అందుకే మనం ఎప్పుడు ఎవ్వరిని మోసం చేయకూడదు. చేస్తే మనం కూడా మోసపోతాము అని తెలుసుకుంటాము.

‘ఆన్‌ లైన్‌ క్లాస్‌’ అనే కథలో సెల్‌ ఫోన్‌ వాడద్దని చెప్పిన ఉపాధ్యాయుల చేతనే సెల్ఫోన్లో క్లాసులు చెప్పేలా చేసింది కరోనా. కరోనా కాలంలో మంచి విద్యార్థి ఎప్పుడు పాఠశాలలు ఓపెన్‌ అవుతాయి. అవి ఎదురుచూసారు. ఇలాంటి విద్యార్థులు చాలా గొప్పవారు అవుతారని చెప్పేలా ఈ కథ ఉన్నది.

‘ గురువు చూపిన దారి’ అనే కథలో రాజు గురువు గారు చెప్పిన మాటలను గమనించి ఆ మాటలను రాజు మనసులో పెట్టుకొని రాత్రి ఎన్ని కష్టాలు వచ్చినా చదువును వదిలి పెట్టవద్దని ఆరోజు నిర్ణయించుకున్నాడు. కొన్నేళ్ల తరువాత రాజు ఉపాధ్యాయుడయ్యాడు.ఈ కథ కష్టం విలువ చెప్పింది.

‘ముసలి నాన్న’ అనే కథలో రాము వాళ్ళ అమ్మ నాన్నలు వారి ఇంట్లో నుంచి వారి తాతను పంపించారు. కాని ముసలి నాన్నకి ఇంట్లో నుంచి పంపించిన వారి మీద కోపం లేదు. వారు అంటే ఇష్టం. ఈ కథ తాత మనవళ్ల అనుబంధం గురించి చక్కగా వివరిస్తుంది.

‘ఇంగిత జ్ఞానం, చిన్న గుణపాఠం, సమయం విలువ, కుక్క విశ్వాసం, పాత సైకిలు లాంటి కథల్లో కూడా పిల్లలకు ఉపయోగపడే సందేశాలు చాలా ఉన్నాయి. ప్రతి కథ చదవాలని అనిపిస్తుంది.

దుర్గమ్‌ భైతి గారు రాసిన ఈ రామసక్కని పుస్తకంలో మొత్తం ఇరవై కథలున్నాయి. పిల్లలు ఈ కథలను ఎంతో ఇష్టంగా చదువుతారు.

      ఇలాంటి గొప్ప అవాకాశాన్ని ఇచ్చిన  సహదేవ్ గారికి ధన్యవాదాలు ,నాకు సపోర్ చేసిన ప్రతి ఒకర్కి పేరు పేరున ధ్యవాదాలు తెలుపుకుంటున్నాను.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *